ETV Bharat / state

అలా అమ్మకాలు జరిగితే... రూ.30 వేల కోట్ల ఆదాయం

రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ఆదాయం గట్టిగానే వస్తోంది. ధరలు పెంచినందున.. విక్రయాలు తక్కువగానే ఉన్నా.. ఆదాయం ఎక్కువగానే వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది తరహాలోనే మద్యం విక్రయాలు జరిగితే.. భారీగా పెంచిన ధరల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా.

PROFITS IN LIQUOR MARKET DURING LOCKDOWN
ఏపీలో మద్యం ఆదాయం
author img

By

Published : May 7, 2020, 12:21 PM IST

Updated : May 7, 2020, 12:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది తరహాలోనే మద్యం విక్రయాలు జరిగితే.. భారీగా పెంచిన ధరల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా. అంటే గతేడాది కంటే రూ.13 వేల కోట్ల మేర అదనపు ఆదాయమొచ్చే అవకాశముంది. గతేడాది మొత్తం విక్రయ విలువలో 84.60శాతం ఆదాయం.. లైసెన్సు రుసుములు, ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, ప్రివిలేజ్‌ ఫీజు, రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం, అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ సుంకం తదితరాల రూపంలో ఇది సమకూరింది.

తాజాగా ప్రభుత్వం మద్యం ధరలు భారీగా పెంచిన నేపథ్యంలో... గతేడాది పరిమాణంలోనే మద్యం అమ్ముడైతే...దాని విలువ దాదాపు రూ.36,500 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ మొత్తంపై సుమారు 84 శాతం వరకూ వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ లెక్కన రూ.30 వేల కోట్ల వరకూ ఆదాయం సమకూరే అవకాశముంది.

సాధారణంగా ఏటా అమ్ముడయ్యే మద్యం పరిమాణంలో వృద్ధి నమోదవుతుంటుంది. గతేడాది మాత్రం కొంత తగ్గుదల నమోదైంది. అమ్ముడైన మద్యం పరిమాణం తగ్గినా... అప్పటికే ఒకసారి మద్యం ధరలు పెంచటంతో.. అంతకు ముందేడాదితో పోలిస్తే ఆదాయం మాత్రం పెరిగింది. తాజాగా మద్యం ధరలను 75 శాతం పెంచిన నేపథ్యంలో అమ్ముడయ్యే మద్యం పరిమాణం కొంత తగ్గే అవకాశముంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మద్యపాన నిషేధం అమలుకు కట్టుబడి ఉన్నాం: నారాయణస్వామి

‘దశల వారీగా మద్యపాన నిషేధం అమలుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా మద్యనిషేధం చేసిన తర్వాతే సీఎం జగన్‌ ఎన్నికలకు వెళ్తారు. తాగేవారికి షాక్‌ తగలాలనే ధరలు 75 శాతం పెంచాం.’ అని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కె.నారాయణస్వామి పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో 43 వేల బెల్ట్‌షాపులు ఉండేవని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటినీ తొలగించిందని చెప్పారు.

మూడో రోజు రూ.47 కోట్ల మద్యం అమ్మకాలు

రాష్ట్రంలో బుధవారం దాదాపు రూ.47 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ధరలు భారీగా పెంచిన నేపథ్యంలో అమ్మిన మద్యం పరిమాణం తగ్గినప్పటికీ, విక్రయ విలువ మాత్రం తగ్గలేదు.రాష్ట్రంలో సగటున రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. సోమవారం రూ.68 కోట్లు, మంగళవారం రూ.30 కోట్ల మద్యాన్ని విక్రయించారు. గత మూడు రోజుల్లో రూ.145 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

ఇదీ చదవండి:

విశాఖలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం..ముగ్గురు మృతి

Last Updated : May 7, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.