మైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించిన కేసులో... నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చెందిన నూకపెయ్యి సురేష్ అనే యువకుడికి జీవిత ఖైదుతో పాటు రూ.15 వేల రూపాయల జరిమానా విధిస్తూ... కాకినాడలోని ఫోక్సో కోర్టు జడ్జి సి.సత్యవాణి తీర్పునిచ్చారు. ఈ విషయాన్ని పి.గన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ సురేంద్ర వెల్లడించారు.
నిందితుడు సురేష్.. బాలికను మోసగించి గర్భవతిని చేశాడని తెలిపారు. 2016 జూన్ 4న అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ పి.వీరబాబు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసు తుది విచారణ జరిగిందని.. నిందితుడు సురేష్‌కు జీవిత ఖైదు పడిందని వివరించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండీ అక్బర్ ఆజాం కేసును వాదించినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: