ETV Bharat / state

కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీకి న్యాయపరమైన చిక్కులు - కాకినాడలో మడ అడవుల వివాదం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మడ అడవులున్న భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై వివాదం నెలకొంది. ఈ స్థలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై కొందరు న్యాయస్థానం, ఎన్జీటీలను ఆశ్రయించారు. ఈ క్రమంలో భూములపై స్పష్టత వచ్చేవరకు పట్టాల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీకి న్యాయపరమైన చిక్కులు

author img

By

Published : May 2, 2020, 5:45 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కాకినాడ నగరంలో ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ యంత్రాంగం నగర శివారు దుమ్ములపేట సమీపంలో ఎంపిక చేసి ప్లాట్లుగా అభివృద్ధి చేస్తున్న భూమిపై న్యాయస్థానంతోపాటు.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను కొందరు ఆశ్రయించారు. మడ అడవులున్న భూములను ఇళ్ల నిర్మాణానికి కేటాయించడం సరికాదని వారు తప్పు పడుతున్నారు... అధికారులు మాత్రం ఇవి మడ అడవి భూములు కాదంటున్నారు. సంబంధిత భూముల్లో ప్రస్తుత పరిస్థితి పరిశీలించడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) అయిదుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ క్రమంలో భూములపై స్పష్టత వచ్చేవరకు పట్టాల పంపిణీపై ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు.

కాకినాడ నగర పరిధిలో పోర్టుకు చెందిన 126 ఎకరాల స్థలంలో ఇప్పటికే అయిదెకరాలు రైల్వే అవసరాలకు కేటాయించారు. మిగిలిన 116 ఎకరాల్లో 4,600 మందికి ఇంటి స్థల పట్టాలు కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ తరుణంలో భూములపైనే వివాదం ముసురుకుంది. ఇది నోటిఫైడ్‌ భూములుగానీ, అటవీ భూములు గానీ కావని.. ఇక్కడ పోర్టు కార్యాలయంతోపాటు ఇతర నిర్మాణాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పట్టాల పంపిణీకి నిర్దేశించిన భూములు మడ అడవులకు సంబంధించినవి కాదని జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అన్నారు. ఈ భూమి పరిస్థితిని చెన్నైలోని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ప్రాంతీయ కార్యాలయానికి చెందిన సీనియర్‌ అధికారి, ఏపీ కోస్తా తీర ప్రాంత సీనియర్‌ అధికారి, అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ సిఫార్సు చేసిన సీనియర్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌, డీఎఫ్‌వోలతో కూడిన కమిటీ బృందం పరిశీలించనుంది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు కమిటీ నిర్ధారిస్తే.. బాధ్యులపై చర్యలు ఉంటాయని పేర్కొన్న ఎన్జీటీ తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. నివేదికకు మూడు నెలల గడువు ఇవ్వడం వల్ల తీర్పు అనంతరమే ఈ వ్యవహారంపై కదలిక వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇదీ చూడండి..

'మడ అడవుల్లో భూ కుంభకోణం.. బురదకాల్వల్లో ఇళ్ల స్థలాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.