భద్రాచలం, ఒంట్టిమిట్టలో నిర్వహించే సీతారాముల కల్యాణానికి... కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకుడు అప్పారావు ఏటా కోటి తలంబ్రాలను అందిస్తాడు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో ఉన్న తన పొలంలో కోటితలంబ్రాల పంటను సాగుచేసాడు. శ్రీరామనామ స్మరణతో... కీర్తనలను అలపిస్తూ... వరి కోత కార్యక్రమం నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామాన్ని స్మరిస్తూ వడ్లను గోటితో వొలిచి తలంబ్రాలను స్వామివారి కల్యాణానికి పంపిస్తామని అప్పారావు తెలిపారు.
ఇదీ చదవండి: మంటలు చెలరేగి 18 ఎకరాల చెరకు పంట దగ్ధం