ఎన్నికల సంఘాలు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ నేటికీ కొన్నిచోట్ల ఓట్లు వేసేందుకు ఓటర్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు లంక గ్రామస్థులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వశిష్ట గోదావరి నది దాటి కోడేరు వెళ్లాలి. కోడేరు లంకలో సుమారు 600 మంది ఓటు ఉన్నాయి. వీరంతా పడవలో వశిష్ట గోదావరి రెండు రేవులు దాటి కోడేరు వెళ్లి ఓట్లు వేస్తున్నారు.
కోడేరు లంకలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని నలభై ఏళ్లుగా మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గోడును ఆలకించి కోడేరు లంకలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఒడిశా ప్రభుత్వం ఆంక్షలతో.. ఏవోబీ సరిహద్దుల్లో ప్రారంభంకాని పోలింగ్