ETV Bharat / state

కార్తిక పౌర్ణమి వేళ.. కోటి దీప కాంతులు

కార్తిక పౌర్ణమి, మూడో సోమవారం కావటంతో వేకువజాము నుంచే శివాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని శైవ ఆలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించిన భక్తులు..ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు నిర్వహించారు. నోములు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు

karthika pouranami   in andhra pradesh
కార్తిక పౌర్ణమి
author img

By

Published : Nov 30, 2020, 7:06 AM IST

కార్తిక పౌర్ణమి వేళ.. కోటి దీప కాంతులు

కా‌ర్తిక పౌర్ణమి, మూడో సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. స్వామి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివనామ స్మరణతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. కర్నూలు జిల్లా శ్రీశైలంలో తెల్లవారుజాము నుంచి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పరిధిలోని గౌతమి.. వృద్ధ గౌతమి.. గోదావరి నది తీరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి గోదావరి తీరానికి చేరుకుని మహిళలు దీపాలు వెలిగించి గోదావరి నదిలో వదిలారు. వేదపండితులకు కార్తిక దామోదర మంత్రం పఠిస్తూ దీప తర్పణం చేసి ఆశీర్వాదం పొందారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో పోలీసులు పరిమిత సంఖ్యలోనే భక్తులను స్నానఘట్టాల వద్దకు అనుమతించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. శివనామస్మరణతో మార్మోగాయి. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

కడప జిల్లా వేంపల్లిలోని గవి మల్లేశ్వర స్వామి సన్నిధిలో లక్ష దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో లింగ స్వరూపుడైన స్వామివారికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు , దేవస్థానం ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చదవండి: కమణీయం...కార్తిక దీపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.