కార్తిక మాసం.. సోమవాారాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలోని శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అమలాపురం, అయినవిల్లి , అంతర్వేది, పి గన్నవరం, రాజోలు మామిడికుదురుల్లోని ఆలయాల్లో మహేశ్వరుడిని దర్శించుకుని పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
- ద్రాక్షారామం
ప్రముఖ శైవ క్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. కార్తికమాసం.. సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అఖండ దీపారాధనలు, అభిషేకాలతో పాటు.. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా దేవాలయ కమిటీ చర్యలు తీసుకుంది.
ఇదీ చదవండీ...