తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు గ్రంథాలయాన్ని.. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్న ప్రాచీన విజ్ఞాన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
తెలుగు సాహిత్యంపై ఔత్సాహికులు పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం కల్పించాలన్నారు. తాళపత్ర గ్రంథాల డిజిటలైజేషన్, ప్రాచీన గ్రాంథాలు, తెలుగు నిఘంటువులను పునఃముద్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కమిటీ ఛైర్మన్ షరీఫ్‌తో పాటు సభ్యులు కత్తి నరసింహారెడ్డి, పీవీఎన్ మాధవ్, ప్రత్యేక ఆహ్వానితులు బాలసుబ్రమణ్యం తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు, తెలుగు శాసనాలను పరిశీలించారు. అనంతరం సాహితీ ప్రియులతో సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో పలు ప్రారంభోత్సవాలు..