తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం కొమర్రాజు లంకలోని గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. వివరాలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాజరు ప్రకారం ఉన్నారా లేరా..
రావులపాలెం పర్యటనలో భాగంగా కొమర్రాజు లంకలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఆన్లైన్లో నమోదు చేసిన హాజరు ప్రకారం ఉద్యోగస్తులు ఉన్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సంబంధించిన రికార్డులను సైతం పరిశీలించారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు..
ఉద్యోగులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సమయంలో ఎక్కడికి వెళ్లారు అనేది రికార్డుల్లో నమోదు చేసిన తర్వాతే వెళ్లాలన్నారు. గ్రామ సచివాలయానికి వచ్చిన ప్రజలకు ఉద్యోగస్తులు అందుబాటులో ఉన్నారా లేదా అనేది తెలిసే విధంగా రికార్డులను ఉంచాలని చెప్పారు.
మరోసారి వచ్చేలోగా..
పథకాలకు సంబంధించి అర్హుల జాబితాను అనర్హుల జాబితాను నోటీస్ బోర్డులో ఉంచాలన్నారు. నోటీస్ బోర్డులో జాబితాలు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జాబితాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరొసారి తనిఖీకి వస్తానని రికార్డులన్నీ సక్రమంగా ఉండాలని హెచ్చరించారు.
నాడు-నేడు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదు: మంత్రి సురేశ్