తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర.. సమావేశం నిర్వహించారు. జనం కోసం -జనసేన అనే నినాదంతో అనునిత్యం ప్రజల్లో ఉంటున్నట్లు చెప్పారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో జనసైనికులు ఎంతో మంది పేదవారికి సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎల్లప్పడూ ప్రజల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతున్నామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. ఇంటి పంట కార్యక్రమం ద్వారా 70వేల కుటుంబాలకు విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: మూడు అతి సూక్ష్మ బంగారు శివలింగాలు..!