తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ రాజధానిపై ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాజధానిని తరలిస్తే ఊరుకోమని ...మేమేప్పుడూ అమరావతిని అక్కడినుండి మార్చాలని చెప్పలేదనన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకోవద్దు అని మాత్రమే అన్నామన్నారు. అంతేగాక అమరావతిలో ఐదేళ్లపాటు రూ.7 కోట్ల పెట్టుబడులు పెట్టి... ఇప్పుడెలా తరలిస్తారని ప్రశ్నించారు. హరిత రాజధానే మా ఆకాంక్ష అని ఉద్ఘాటించారు. గతంలో రాష్ట్రం విడిపోతే తప్పేంటన్న బొత్స సత్యనారాయణ..ఇప్పుడూ రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఆలయాలకు దూపదీపాల కింద నిధులు విడుదల చేయకుండా జాప్యం చేస్తూ..అర్చకుల సమస్యలను సైతం పరిష్కరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల విషయంలో చిన్నపాటి ఉద్వేగాలు వ్యక్తం చేసేవారిపై పోలీసుశాఖ కొంత సంయమనం పాటించాలని కోరారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఓపికతో ఉండాలని సూచించారు.
హరిత రాజధానే మా ఆకాంక్ష: పవన్ కల్యాణ్ - గ్రీన్క్యాపిటల్
రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాజధాని అక్కడినుండి తరలించడం కుదరదని స్పష్టం చేశారు.