జై భీమ్ భారత్ పార్టీ వైకాపా ప్రభుత్వం గుండెల్లో వణుకు పుట్టిస్తోందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. రాజమహేంద్ర వరంలో బహుజన గర్జన సభలో పాల్గొన్న ఆయన, హై కోర్టులో దళితులు, బాధితుల పక్షాన తాను వాదించిన కేసులు, మీడియాలో వచ్చిన అంశాలను ప్రస్తావించాడు. వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దాడుల్ని శ్రవణ్ కుమార్ ప్రదర్శించారు. వైకాపా పాలనలో తూర్పు గోదావరి జిల్లాలో దళిత యువతీ, యువకులపై పలు దాడులు, శిరోముండనాలు, హత్యలు జరిగినా.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించందని ఆరోపించారు. గత ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ బైబిల్ పట్టుకొని తిరగడంతోనే దళితులంతా జగన్ ఓటు వేశారని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో వేధింపులకు గురైన దళిత బాధితుల్ని ఒకే వేదికపైకి తీసుకవచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించినట్టు శ్రావణ్ కుమార్ వెల్లడించారు. ఈ సభలో మాజీ ఎంపీ హర్షకుమార్ తోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి దళిత, బలహీన, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.
దళిత బాధితుల్ని ఏకం చేస్తోన్న జై భీమ్ భారత్ పార్టీ అంటే వణుకు - jai Bheem Bharat party
జై భీమ్ భారత్ పార్టీ వైకాపా ప్రభుత్వ గుండెల్లో వణుకు పుట్టిస్తోందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు. రాజమహేంద్ర వరంలో బహుజన గర్జన సభలో పాల్గొన్న ఆయన, హై కోర్టులో దళితులు, బాధితుల పక్షాన తాను వాదించిన కేసులు, మీడియాలో వచ్చిన అంశాలను ప్రస్తావించాడు.