తూర్పు గోదావరి జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 4,335 పాఠశాలలున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు 4,19,445 మంది పిల్లలు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం విద్యా కానుక కింద పాఠ్య, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బ్యాగు, బూట్లు, సాక్సులతో కూడిన కిట్టును అందించనుంది. ఇప్పటి వరకు 81 శాతం కిట్లు జిల్లాకు చేరాయి. వీటిని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రోజుకు 1/3 వంతు మంది పిల్లలకు పంపిణీ చేయనున్నారు. కిట్ల పంపిణీలో భాగంగా ఆయా పాఠశాలల వద్ద శానిటైజర్లను సిద్ధం చేశారు.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం..
విద్యాకానుక పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే కానుక కిట్లను ఆయా పాఠశాలలకు చేర్చాం. భౌతిక దూరం పాటిస్తూ కానుక కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. దీని కోసం పీఈటీలతో కమిటీలు వేశాం. వారు పిల్లలు భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కిట్లు స్వీకరించేందుకు వచ్చే విద్యార్థులు మాస్కులు ధరించాలి. పంపిణీ సందర్భంగా ఆయా పాఠశాలల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించాô. ఒకేసారి కాకుండా 1/3 వంతు విద్యార్థులకు వంతుల వారీగా కిట్లను పంపిణీ చేస్తాం. -బి.విజయభాస్కర్, సమగ్ర శిక్ష ఏపీసీ
ఇదీ చదవండి: విశాఖ కేజీహెచ్‌లో కొవిషీల్డ్ మానవ ప్రయోగాలు