ETV Bharat / state

జగనన్న పచ్చతోరణం..మొక్కను నాటిన ఎంపీ - Jagannanna Pachatoranam

తొర్రేడులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే లే అవుట్ వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ రామ్ హాజరయ్యారు. అనంతరం మొక్కను నాటారు.

jagannanna-pachatoranam-plant-planted-mp

author img

By

Published : Jul 22, 2020, 6:02 PM IST

Updated : Jul 22, 2020, 10:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొర్రేడులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే లే అవుట్ వద్ద జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ భరత్ రామ్ మొక్కను నాటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలుగన్న హరితాంధ్రప్రదేశ్​ని తీర్చిదిద్దే విధంగా సీఎం జగన్ జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఎంపీడీవో సుభాషిణిపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం సమన్వయకర్త ఆకుల వీర్రాజు, ఎంపీడీవో సుభాషిణి, ఏపీవో మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

చీరాల దళిత యువకుడి మృతి....దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

Last Updated : Jul 22, 2020, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.