ETV Bharat / state

Investigation Start: పోలీసులకు ఎంపీడీవో ఫిర్యాదు.. వైకాపా నేత తాతాజీ అరెస్టు

Investigation on Ainavilli MPDO Complaint : వైకాపా నేత తనను తీవ్ర పదజాలంతో దూషించాడన్న ఎంపీడీవో ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎంపీడీవో కె.ఆర్ విజయ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన వైకాపా నాయకుడు వాసంశెట్టి తాతాజీను అరెస్టు చేశారు.

author img

By

Published : Dec 7, 2021, 11:15 AM IST

Updated : Dec 7, 2021, 7:23 PM IST

పోలీసులకు ఎంపీడీఓ ఫిర్యాదు...వైకాపా నాయకులపై కేసు నమోదు

Investigation on Ainavilli MPDO Complaint : తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో విజయ ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ మాధవరెడ్డి అయినవిల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో విచారణ చేపట్టి వైకాపా నేత వాసంశెట్టి తాతాజీ ను అరెస్టు చేశారు. తాతాజీ తనను తీవ్ర పదజాలంతో దూషించారని ఎంపీడీవో విజయ...నిన్న (సోమవారం) అమలాపురం ఆర్డీవో, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు నలుగురిపై కేసులు నమోదు చేశారు.

తాతాజీ అరెస్టు...

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన వైకాపా నాయకుడు వాసంశెట్టి తాతాజీను అరెస్టు చేశారు.ఈ మేరకు డీఎస్పీ వై.మాధవ రెడ్డి వెల్లడించారు. జడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, వైకాపా నాయకుడు మేడిశెట్టి శ్రీనివాసరావు, కుడిపూడి రామకృష్ణ కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ జరిగింది...

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి ఎంపీడీవో కె.ఆర్ విజయకు నల్లచెరువు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు తాతాజీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జడ్పీటీసీకి ప్రోటోకాల్ పాటించటం లేదని...,తాము చెప్పినట్లు వినకపోతే చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

దీనిపై స్పందించిన ఎంపీడీవో విజయ.. కె.జగన్నాథపురంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన నలుగురు వాలంటీర్లను తప్పించానన్నారు. వాలంటీర్లను తప్పించటతో పాటు జడ్పీటీసీ సభ్యుడికి ప్రోటోకాల్ పాటించలేదని నా మీద ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయారు. తనను హెచ్చరించిన తాతాజీతో పాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని అమలాపురం ఆర్టీవో వసంతరాయుడు, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఎంపీడీవో విజయ పట్ల వైకాపా నాయకుడు దురుసు ప్రవర్తనను ఖండిస్తూ నేడు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎంపీడీవోలు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని జిల్లా సంఘం పిలుపునిచ్చింది.

ఇవీచదవండి

Last Updated : Dec 7, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.