ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి ఉధృతి పెరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కాపర్ డ్యామ్ నిర్మాణంతో ఆగస్టులోనే ఏడు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం కాపర్ డ్యాం నిర్మాణం పూర్తైంది. అయితే అధికారులు ముందుగానే పునరావాస చర్యలు చేపట్టారు. గోదావరి వరద విపత్తులను ఎదుర్కొనేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య ఆధ్వర్యంలో.. ఐదుగురు గల అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పూర్తయిన పునరావాస కాలనీలకు నిర్వాసితులను తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి. మరుగున పడ్డ మానవత్వం.. వైద్యం అందక వృద్ధుడి నరకయాతన