తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో అక్రమంగా జరుపుతున్న మట్టి తవ్వకాలు గ్రామస్థులు అడ్డుకున్నారు. వానపల్లి శివారు సత్తెమ్మలంకలో గోదావరి చెంతన మట్టిని తవ్వేందుకు శనివారం అర్ధరాత్రి కొందరు ప్రయత్నించారు. జేసీబీ యంత్రంతో మట్టి తవ్వేందుకు బాట వేస్తున్న సమయంలో సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని జేసీబీని సీజ్ చేశారు.
ఇది చదవండి కరోనా నుంచి కోలుకున్నమహిళలకు అభినందనలు