ETV Bharat / state

అకాల వర్షాలతో అరటి రైతుకు అపార నష్టం

గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లాలోని అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

huge loss for east godavari banana farmers
అపారంగా నష్టపోయిన అరటి రైతులు
author img

By

Published : Apr 10, 2020, 8:13 PM IST

రావులపాలెం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో అరటి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. గురువారం ఈదురు గాలుల కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని అరటి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. సుమారు 500 ఎకరాలకు పంట దెబ్బతింది. జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల రూపాయల మేర పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడాది పాటు పెట్టుబడులు పెట్టిన పంట చేతికొచ్చే సమయానికి చేజారిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కరోనా వైరస్​ కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు గాక రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి:

భారీ వర్షాలతో నేల రాలిన మామిడి, అరటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.