సిద్ధి వినాయకుడికి కొబ్బరికాయతో కోరికలు..! వినాయక చవితి తొలిరోజున తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. కొబ్బరికాయ కొట్టి కోర్కెలు కోరితే వెంటనే ఈ నారికేళ ప్రియుడు కరుణిస్తాడని ప్రజల విశ్వాసం. చవితి రోజు స్వామిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని వారి నమ్మకం. ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. పార్వతీ తనయుని బుర్రకథ విని తరించారు.
ఇవీ చదవండి...అటు 'యాపిల్' గణేశుడు.. ఇటు 'బాదం' గణనాథుడు