ETV Bharat / state

First Night in University?: యూనివర్సిటీలో శోభనమా?... ఇదెక్కడి చోద్యం?

author img

By

Published : Aug 21, 2021, 7:44 PM IST

జేఎన్టీయూ కాకినాడ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో ఓ జంట శోభనానికి ఏర్పాట్లు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఇటువంటి కార్యక్రమాలకు అతిథిగృహాన్ని.. అది కూడా చదువులకు నిలయమైన యూనివర్సిటీలోని గదులను వినియోగించడంపై విమర్శలు వస్తున్నాయి.

HONEY MOON
HONEY MOON
జేఎన్టీయూ కాకినాడ అతిథి గృహంలో శోభన ఏర్పాట్లు...

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో.. నూతన వధూవరుల శోభనానికి జరిగన ఏర్పాట్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాన్ని.. యూనివర్సిటీకి చెందిన వారికి మాత్రమే కేటాయిస్తారు.

కానీ.. ఉమెన్ ఎంపవర్​మెంట్ డైరెక్టర్ స్వర్ణకుమారి పేరిట ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు అతిథిగృహాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలోనే.. వివాహ వేడుక అనంతరం ఒక గదిలో శోభన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇలాంటి వాటిని అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులు విచారణ చేపట్టారు. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:

POSTAL COVER: ఆత్రేయపురం పూతరేకులకు గుర్తింపు..పోస్టల్ కవర్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.