తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎండలు విపరీతం కావడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కొత్తపేట నియోజకవర్గంలో ప్రధాన రాహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 5 వరకు ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. వ్యాపారస్థులు సైతం దుకాణాలు మూసి వేస్తున్నారు.
అధిక ఉష్ణోగ్రతతో నిర్మానుష్యంగా మారిన రహదారులు - తూర్పుగోదావరి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
నిన్నటి వరకు లాక్డౌన్ కారణంగా ఖాళీగా ఉన్న రహదారులు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు కారణంగా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.
నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న రహదారులు