ETV Bharat / state

అభిమాని ఆరోగ్యంపై చిరంజీవి ఆరా

కరోనాతో తన అభిమాని ఆసుపత్రిలో చేరారని తెలుసుకున్న హీరో చిరంజీవి... అతనికి ఫోన్ చేసి మాట్లాడారు. ఏమీ కాదని అభిమానికి మనోధైర్యం చెప్పారు.

hero chiranjeevi called to his fan
చిరంజీవి
author img

By

Published : May 2, 2021, 12:09 PM IST

‘హాయ్‌.. నేను చిరంజీవిని మాట్లాడుతున్నానయ్యా.. నీ ఆరోగ్యం బాగోలేదని తెలిసింది.. నేను పెద్ద డాక్టర్‌ గారితో మాట్లాడా.. తగ్గిపోతుందని చెప్పారు..’ అంటూ ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కరోనాతో చికిత్స పొందుతున్న తన అభిమానితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి చిరంజీవి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయన ఆరోగ్యంపై శనివారం ఆరా తీశారు. కాకినాడలోని ఆసుపత్రి ప్రధాన వైద్యుడితో స్వయంగా చరవాణిలో మాట్లాడారు. అనంతరం తన అభిమానితో కూడా కొద్దిసేపు మాట్లాడి మనోధైర్యం కల్పించారు.

ఇదీ చదవండి: ఆ పిచ్చుకలు, చిలకలే ఆయన నేస్తాలు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.