కడప జిల్లా జమ్మలమడుగు,మైదుకూరులో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి . కేసీ కాలువ ఆయకట్టు ప్రాంతాలకు వర్షపు నీరు తోడవ్వటంతో రహదారులపై వరద నీరు చేరింది. వర్షానికి వరినాట్లు మునిగిపోతున్నాయని...రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2004 సంవత్సరంలో ఇలాంటి భారీ కుండపోత వర్షం కురిసింది. తరువాత 15సంవత్సరముల తర్వాత కుండపోత వర్షం కురిసిందని జిల్లా వాసులు తెలిపారు.ముఖ్యంగా మైలవరం మండలంలోని దొడియం, నక్కవానిపల్లె, రామచంద్రాయపల్లె తదితర గ్రామాలలో వాగులు ,వంకలు ఏకమై పొంగి పొరలి గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు, పొలాలలోకి భారీ వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి.
ఇవీ చదవండి