ETV Bharat / state

నిండా ముంచిన వాన... రైతు కోలుకునేదెలా? - heavy rain in vishaka district

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న కుండపోత వానలు ఉభయగోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలను నీటముంచాయి. భారీ వర్షాల కారణంగా విశాఖ, కర్నూలు జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో ఉద్యానపంటలు వర్షార్పణం కాగా..రవాణా, విద్యుత్తు సరఫరా వ్యవస్థలు స్తంభించిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలంలో ముంపునీటిలో వరి పనులు

author img

By

Published : Oct 15, 2020, 10:05 AM IST

తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న కుండపోత వానలు ఉభయగోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలను నీటముంచాయి. తూర్పుగోదావరి జిల్లాలో 29,943 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 2వేల హెక్టార్ల వరకు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. ప్రస్తుతం దెబ్బతిన్న వరి పంటలో 9,017 హెక్టార్ల మేర నేలకొరిగిందని అంచనా. మిగిలింది రోజుల తరబడి నీట మునిగే పరిస్థితి ఉంది. ఈనిక, చిరుపొట్ట దశలో ఉన్న ఈ రెండూ బతికే అవకాశం తక్కువే. పత్తి, మినుముతోపాటు అరటి, బొప్పాయి, పూలు, మిరప, ఉల్లి, కర్రపెండలం తదితర ఉద్యాన పంటలు నీటమునిగి, నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఏలేరు జలాశయం నీటి నిల్వలు పెరిగి 18 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దిగువన కిర్లంపూడి, పిఠాపురం, గొల్లప్రోలు, జగ్గంపేట, పెద్దాపురం మండలాల్లో 23 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి.

పశ్చిమలో వరద బీభత్సం
వరద బీభత్సానికి పచ్చని పశ్చిమ చిగురుటాకులా వణుకుతోంది. 39,354 ఎకరాల్లో చేతికొచ్చిన వ్యవసాయ పంటలు నీటమునిగాయి. 1,540 ఎకరాల్లో ఉద్యానపంటలూ వర్షార్పణమయ్యాయి. రవాణా, విద్యుత్తు సరఫరా వ్యవస్థలు స్తంభించిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తమ్మిలేరు జలాశయం నుంచి బుధవారం 15 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో ఏలూరులోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండు సహా పలు కాలనీలను చుట్టుముట్టింది. ప.గో.జిల్లాలో 64 ఇళ్లు, 900 కి.మీ. ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. తమ్మిలేరు, ఎర్రకాలువ, జల్లేరు, బైనేరు, గుండేరు, సుద్దవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పరివాహక ప్రాంతాల్లో పంటచేలు ముంపు బారిన పడ్డాయి.
విశాఖ జిల్లాలో 11,500 ఎకరాలు మునక..
మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లాలో 11,500 ఎకరాల్లో వరి, చెరకు, మొక్కజొన్న పంటలు నీట మునిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వేల ఎకరాలు ఇంకా నీట మునిగే ఉండడంతో పంటలపై రైతులు ఆశలు వదులుకొంటున్నారు. విశాఖ నగరంలో ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం సంభవించింది. పలు రహదారులపై గుంతలు పడ్డాయి. భారీ వర్షాలకు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బొల్లవరం గ్రామంలో రైతులు సాగు చేసిన మొక్కజొన్న తడిసి మొలకలొచ్చాయి. ఉల్లి పంట వర్షానికి కుళ్లిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు 2 వేల హెక్టార్లలోని వరి పంట నీటమునిగింది. మరో వెయ్యి హెక్టార్ల వరి పంట నేలకొరిగింది. దాదాపు వెయ్యి హెక్టార్లలోని పత్తిపంటపైనా వర్షాల ప్రభావం పడింది. సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు మేరుగు నరేశ్‌(20) స్థానిక గెడ్డలో చేపలు పడుతుండగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో గల్లంతయ్యాడు. వీరఘట్టంలో వర్షాలకు కూలిన ఇంటి ముందు పడి ఉన్న విద్యుత్తు తీగలను గమనించక కల్యాణరాం (11) అనే బాలుడు మృత్యువాత పడ్డాడు.

లంక గ్రామాల్లోకి వరదనీరు
ప్రకాశం బ్యారేజీ నుంచి 7లక్షల క్యూసెక్కులపైగా వరదనీరు నదికి విడుదల చేయడంతో గుంటూరు జిల్లా లంక గ్రామాల్లోకి నీరు చేరింది. అచ్చంపేట, బెల్లంకొండ, అమరావతి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లో పంటలు నీటమునిగాయి. కృష్ణానది నుంచి పెద్దమద్దూరు వాగులోకి వరదనీరు వెనక్కి రావడంతో అమరావతి-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

టంకం లేకుండా విద్యుత్తు సరఫరా

ఉభయగోదావరి జిల్లాల్లో వరద ప్రభావంతో దెబ్బతిన్న ఫీడర్లకు మరమ్మతులు చేసి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించినట్లు ఇంధన శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 97 శాతం ఫీడర్లను 24 గంటల్లో పునరుద్ధరించామని పేర్కొంది. ‘పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. పశ్చిమగోదావరిలో దెబ్బతిన్న మూడు 33 కేవీ, ఒక 132 కేవీ సబ్‌ సబ్‌స్టేషన్లకు బాగు చేశాం’ అని ప్రకటనలో పేర్కొంది. విద్యుత్‌ సరఫరాకు ఇబ్బంది లేకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్‌ పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరా తీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు.

వెన్ను‘వరి’గిన.. రైతన్న

ధాన్యాగారంగా పేరున్న తూర్పుగోదావరి జిల్లాను విపత్తులు వెంటాడుతున్నాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు కాలం కలిసి రావడం లేదు. వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులదీ అదే దుస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్‌లో 2.14 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. రబీలో 1.63 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. ఇక్కడ కేవలం వరి పండించే రైతులు 3.5 లక్షల మంది ఉన్నారు. ఆగస్టు నెలలో వరుసగా రెండుసార్లు వరదలు వచ్చి 8,875 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 12,442 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సెప్టెంబర్‌లో అకాల వర్షాలకు 37,250 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,186 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. తాజాగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో 29,943 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 2,000 హెక్టార్ల వరకు ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. వరికి ఎకరాకు రూ.20 వేల వరకు.. ఉద్యాన పంటలకు రూ.వేలల్లో పెట్టుబడి పెట్టారు. ఇక్కడ నీటమునిగిన వరి కోలుకునే పరిస్థితి కనపడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆశ వదులుకున్నా..
- మట్టపర్తి సూర్యనారాయణ, రైతు, గాజులగుంట, పి.గన్నవరం మండలం
రెండున్నర ఎకరాల్లో వరి వేశా. నాట్లు వేశాక గోదావరి వరదలకు చేను మునిగింది. ముంపు తగ్గాక సస్యరక్షణ చర్యలు చేపట్టాను. కోలుకునేలోగా మళ్లీ వరదలొచ్చి మునిగింది. ఆశలు వదులుకోలేక కొంత పెట్టుబడి పెట్టా. ఉన్న దాంట్లో 70 శాతం చేను కోలుకుంది. గత నెలలో భారీ వర్షం, ఇప్పుడు ఏకధాటిగా వానలు. ఇక ఈ ఖరీఫ్‌లో పంటమీద ఆశ వదులుకున్నా. రూ.30 వేల పెట్టుబడి పోయినట్లే.

ఇదీ చదవండి

విలయం... వాయుగుండంతో రాష్ట్రంలో విధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.