తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. మన్యంలో వరి పంటలు నీట మునిగాయి. వాగులు పొంగి ప్రవహించాయి. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి (భూపతిపాలెం జలాశయం సమీపంలో), మోతుగూడెం నుంచి చింతూరు వెళ్లే ప్రధాన రహదారి జల దిగ్బంధం అయింది.
రాకపోకలు స్తంభించి గిరిజనులు ఇబ్బంది పడ్డారు. మోతుగూడెం మన్యంలో ఏకథాటిగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి. తీవ్రంగా నష్టపోయామని గిరిజన రైతులు వాపోయారు. మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షం కురిస్తే కొండ వాగులు పొంగి రాకపోకలు పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉంది.
పశ్చిమగోదావరి జిల్లాలో...
ఏజెన్సీ మండలాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బుట్టాయగూడెం మండలం విప్పలపాడు, జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెం వద్ద జల్లేరు వాగు పొంగగా.. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విప్పలపాడు వద్ద వాగు ధాటికి తాత్కాలిక అప్రోచ్ రోడ్ కొట్టుకు పోయింది.
ఇదీ చూడండి: