తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న పనస చెట్టు అందరినీ ఆకట్టుకుంటోంది. నిండా కాయలతో ఎంతో ఆకర్షణగా దర్శనమిస్తొంది. ఏడాదిలోనే తొలి కాపు కాసిందని యజమాని తెలిపారు. సాధారణంగా పనస చెట్టు.. ఎత్తుగా.. భారీ పరిమాణంలో ఉంటుంది. ఈ మొక్క మాత్రం ఎత్తు అంతగా లేకపోయినప్పటికీ.. మొదలు భాగంలోనే సుమారు యాభైకు పైబడి కాయలు కాసింది. ఇవ్వన్ని ఒకదానినొకటి ఆనుకొని రావటంతో.. చెట్టు నిండుగా కనిపిస్తూ.. కనువిందు చేస్తోంది.
ఇవీ చూడండి…