తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా వ్యాప్తి కట్టడికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. తుని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షల్లో ప్రతి 100 టెస్టుల్లో 45 పాజిటివ్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుని సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి నాడు అన్నం పెట్టినవారే.. నేడు ఆకలితో అలమటిస్తున్నారు