తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ముఖద్వారం వద్ద చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. ఒక దశలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని కోసం బస్సు యాత్ర చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారు. ఆయనకు మద్దతు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా ముఖద్వారమైన రావులపాలెం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల వివాదం తలెత్తింది. తాము ధర్నా చేయడం లేదని... రోడ్డు పక్కనుంటే తమ మీద పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణమని కార్యకర్తలు వాపోయారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: