గోప్రచారంలో భాగంగా గోసేవ వరల్డ్ వ్యవస్థాపకులు విష్ణు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానానంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం దేవస్థానం గోశాలను సందర్శించారు. నాణ్యమైన గోవుల్ని మరియు వృషభాలను చక్కని వాతావరణంలో పోషిస్తున్నారని కొనియాడారు. దేవస్థానం ఈవో సౌజన్యను కలిసి అనేక అభివృద్ధి పనుల గురించి చర్చించారు. గోఆధారిత ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. వాటిని భక్తులకు అందుబాటులో ఉంచాలని.. ఫలితంగా భక్తులను గోసేవకు పాత్రులు చేసిన వారవుతారని అన్నారు.
ఆలయంలో యజ్ఞానికి ఆవు పిడకలను వినియోగించాలని, అదేవిధంగా అభిషేకాలకు ఉపయోగించిన పండ్లు, పూలు, పాలు, తులసి కొబ్బరి నీళ్లు మొదలైన వాటికి అత్యంత మంత్ర శక్తి, ప్రాణశక్తి కలిగి ఉంటాయని.. వాటిని రైతులకు వ్యవసాయానికి, ఇళ్లలో కూరగాయలు, పూల మెుక్కల పెంపకానికి ఉచితంగా అందించాలని కోరారు. గోవు ప్రాముఖ్యత, గోసేవ, వ్యవసాయంలో గోవు పాత్ర, పంచగవ్య ఉత్పత్తులతో చికిత్స, సైన్సుపరంగా గోవు నుంచి పొందే ప్రయోజనాలను గోసేవ వరల్డ్ సంస్థ అవగాహన కల్పిస్తోందని.. దానికి అవసరమైన సహాయాన్ని అందించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈవో వీటిపై సానుకూలంగా స్పందించినట్లు విష్ణు తెలిపారు.
ఇదీ చదవండి: