తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఒడ్డున బంగారం ముక్కలు కనిపించాయి. ఇసుకలో చిన్నచిన్న బంగారం ముక్కలు కన్పించడంతో స్థానికులు వాటిని ఏరుకునేందుకు పోటీపడ్డారు. దువ్వెనలు, జల్లెడలతో వెతకడంతో.. 50మందికి చిన్నచిన్నముక్కలు, పూసలు లభించాయి. నివర్ తుపాను కారణంగా రెండు రోజులుగా భారీగా కెరటాలు...వస్తున్నాయి. కడలి లోపల ఉన్న బంగారం అప్పుడప్పుడూ బయటికి వస్తుందని కొంతమంది స్థానికులు అంటున్నారు.
ఇదీ చూడండి. తిరుమలలో భారీ వర్షం .. నిండిన జలాశయాలు