గోదావరి వరదల వలన తూర్పుగోదావరి జిల్లాలోని విలీన మండలాలతో పాటు దేవీపట్నం మండలంలోనీ 50 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమలోని 15 మండలాల పరిధిలోని మరో 50 లంక గ్రామాలు నీటిలో ఉన్నాయి. వర్షాలు తగ్గినా అమావాస్య కారణంగా సముద్రంలోకి నీరు తక్కువగా వెళ్తోంది. దీంతో ఆయా గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఇంకో 2, 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
పలు గ్రామాల్లో ఇళ్లు, పొలాలు నీట మునిగాయి. తోటలు పనికిరాకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. బాధిత గ్రామాల ప్రజలు భయపడవద్దని.. వారి రక్షణకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఇసుక బస్తాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రానికి ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశమున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి..