తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో లంక ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలను ముంచేసింది. ఇళ్లు, తోటలు, పొలాలు నీటమునిగాయి. కూరగాయలు, పూల తోటలు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 2,557 హెక్టార్లలో అరటి, 179.9 హెక్టార్లలో బొప్పాయి, 1,947 హెక్టార్లలో కూరగాయలు, పసుపు, పూలతోటలు, తమలపాకు తోటల్లో పంట నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
ఇవీ చదవండి...