ETV Bharat / state

సందడి లేని చవితి... ఈసారి ఇళ్లల్లోనే వినాయకుడికి పూజలు - ఏపీ వ్యాప్తంగా వినాయకచవితి పూజలు

ఆకాశమంత పందిళ్లు.. భూదేవంత పీటలు.. పెద్ద పెద్ద విగ్రహాలు.. భక్తుల సందోహం.. ప్రసాదాల వితరణ.. పాటల హోరు.. భజనల చప్పుళ్లు.. పిల్లల కేరింతలు.. పెద్దల పూజలు.. యువకుల ఉత్సాహం.. బై బోలో గణేశ్ మహరాజ్​ కీ జై అంటూ హోరెత్తే గొంతులు.. వినాయక చవితి అంటే ఊరూ వాడా కనిపించే దృశ్యాలివి.. ఎవరికి తగ్గట్లు వారు వీధివీధిన పందిళ్లు వేసి, బొమ్మలు పెట్టి, పూజలు చేస్తూ వారి భక్తిని చాటుకునేవారు. అయితే కరోనా అన్నింటినీ దూరం చేసింది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని మనసారా పూజించుకోనీయకుండా అడ్డుకుంది. సామూహిక విగ్రహాలు, ప్రార్థనలు చేయకూడదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించిన వేళ.. ఈ ఏడాది వినాయక చవితి ఇళ్లకే పరిమితమైంది.

ganesh-chaturdhi-celebrations-in-ap-state-wise
వినాయక చవితి
author img

By

Published : Aug 22, 2020, 3:25 PM IST

ఆది దేవునిగా భక్తుల నుంచి తొలి పూజలందుకునే లంబోదరుడు ఈ ఏడాదీ ప్రజల నుంచి పూజలందుకున్నాడు. అయితే పందిళ్లు, మండపాలు, డీజే హంగామా లాంటివేమీ లేకుండా నిశ్శబ్దంగా ఎవరింట్లో వాళ్లు గణేశుడిని పూజించుకున్నారు. కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆంక్షలు విధించిన వేళ వినాయకుడు ఇళ్లకే పరిమితమయ్యాడు.

సందడి లేని చవితి వల్ల ఆలయాలు, వ్యాపారాలు వెలవెలబోయాయి. ఏటా సందడిగా కనిపించే పూజా సామగ్రి దుకాణాలు, పత్రి అమ్మేవారు, మట్టి గణపతులను విక్రయించేవారు కొనుగోలుదారులు లేక ఉసూరుమన్నారు. ఎవరిళ్లలో వారే పండగ చేసుకున్న కారణంగా.. కొద్దిమొత్తంలోనే పూజా సామగ్రి, పత్రి కొనుగోలు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా

జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు, కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రతి ఏడాది గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సంవత్సరం ఆ సందడిలేదు. ఎవరికి వారు తమ ఇళ్లల్లోనే చవితి పండుగ చేసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా

వినాయకచవితి సందర్భంగా జిల్లాలోని ఆదిదేవుని ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడి మంచి రోజులు ప్రసాదించాలని గణేశుని వేడుకున్నారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

కర్నూలు జిల్లా

కర్నూలులో ప్రజలు చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయ నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను దర్శించుకుని పూజలు చేశారు.

విశాఖ జిల్లా

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన స్వయంభూ వినాయకుడి ఆలయానికి నిలయమైన చోడవరంలో నవరాత్రి సందడి కనిపించలేదు. ఆలయం వద్ద కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి ఎస్.ఎస్.వి.సత్యనారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించారు.

కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా విజయవాడలో చవితి సందడి అంతగా లేదు. గతేడాదితో పోలిస్తే అపార్ట్​మెంట్లలో, ఉమ్మడి గృహ సముదాయాలలో పూజలు జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక వేడుకలకు ప్రజలు దూరంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న మట్టి గణపయ్యల విగ్రహాలు ఏర్పాటుచేసుకుని పూజలు చేశారు.

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లాలో ఈసారి వినాయక చవితి ఉత్సవాలు సాదాసీదాగా జరిగాయి. బొబ్బిలిలో ప్రజలు ఇళ్లల్లోనే గణనాధుని పూజించుకున్నారు. గతంలోని సందడి ఎక్కడా కనిపించలేదు.

ఇవీ చదవండి:

కరోనాను దండించు.. జనులను దీవించు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.