ఇదీ చదవండి..అమరావతిని అఖిలపక్షంలోనూ అడ్డుకున్నారు: తెదేపా
గాంధీజీ జీవిత ఘట్టాలతో ఫొటో ప్రదర్శన - gandhiji life photo exhibition
గాంధీ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ దర్శన్ పేరుతో గాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటోలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రాపాక డేవిడ్ కుమార్ ప్రారంభించారు.
గాంధీజీ జీవిత ఘట్టాలతో ఫోటో ప్రదర్శన
గాంధీ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ దర్శన్ పేరుతో గాంధీ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటోలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రాపాక డేవిడ్ కుమార్ ప్రారంభించారు. గాంధీజీ చిన్ననాటి ఫొటో, గాంధీజీ నివసించిన ఇల్లు, స్నేహితులతో సరదాగా దిగిన ఫొటోలు, బ్రిటిష్ ప్రభుత్వానికి రాసిన లేఖలు, ఆయన చేసిన ఉద్యమాలు, అప్పట్లో దిన పత్రికలు ఇటువంటి ఎన్నో చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో గ్రామస్థులు, విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి..అమరావతిని అఖిలపక్షంలోనూ అడ్డుకున్నారు: తెదేపా