పకోడి బండి వద్ద వివాదంతో హత్యగు గురైన బాలుడు శివ అంత్యక్రియలు వీరవరంలో జరిగాయి. పోలీసుల భద్రత మధ్యఅంతిమ యాత్ర కొనసాగింది. నిందితుడు వీరబాబుని ఉరితీయాలి అని గ్రామస్థులు అంత్యక్రియల్లో నినాదాలు చేశారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభ రవిబాబు.. బుధవారం పరామర్శించునున్నారు.
ఏం జరిగిందంటే...?
రెండు రోజుల కిందట వీరవరం గ్రామంలో మాంసం పకోడీ బండి వద్ద వ్యాపారి శింగం ఏసు.. కొవ్వూరి వీరబాబు అనే ఇద్దరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకొంది. మద్యం తాగి ఉన్న వీరబాబు తన స్కార్పియోతో పకోడీ బండిని ఢీకొట్టాడు. బండి వద్ద ఉన్న తండ్రి ఏసు, కుమారుడు శివకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత బాలుడు శివ తలపై వీరబాబు ఇనుప రాడ్‌తో కొట్టాడు. శివను కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అర్ధరాత్రి సమయంలో పరిస్థితి విషమించి మృతి బాలుడు చెందాడు. పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: