తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.
అమలాపురం డివిజన్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. మొత్తం 273 గ్రామ పంచాయతీలు ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 14 పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 3142 వార్డులకు గాను.. 1077వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 259 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
వినూత్నంగా ప్రచారం..
అమలాపురం రెవిన్యూ డివిజన్లోని ముమ్మడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల పరిధిలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు మెంబర్ల అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. కొందరు మంచాలపై కూర్చుని ప్రచారాన్ని నిర్వహిస్తుంటే.. మరికొందరు తమ గుర్తులను నెత్తిన పెట్టుకుని జనాల్లోకి వెళుతున్నారు.
ఇదీ చదవండి: