జల్సాలకు అలవాటు పడి సొమ్ము కోసం ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నలుగుర్ని తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుల నుంచి 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి తెలిపారు.
తాకట్టు వాహనాలు అని చెప్పి..
దొంగ తాళాలు లేదా వాహనం హ్యాండిల్‌ను బలంగా ముందుకు వెనక్కి కదిలించడం ద్వారా వాహనాలను చోరీ చేస్తున్నారని వివరించారు. అనంతరం బహిరంగ మార్కెట్లో సదరు వాహహనాలు తమకు తాకట్టుగా వచ్చాయని.. యజమానులు వాహనాలు తీసుకెళ్లట్లేదని, తమకు వదిలేశారని నమ్మబలుకుతారు. అనంతరం తక్కువ ధరకే విక్రయిస్తారని ఎస్పీ వివరించారు.
ఎస్పీ అభినందన..
ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ రమేష్ బాబు, ఎస్సై శ్రీనివాస్ కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు.
ఇవీ చూడండి : 'చంద్రబాబుకు పేరు దక్కకూడదనే అమరావతిని అడ్డుకుంటున్నారు'