తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండల కార్యాలయం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. గత నెలలో కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారాన్ని అందించాలని వారు డిమాండ్ చేశారు. ఐ. పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో వేల ఎకరాలకు కౌలు చేస్తున్న 500 మందిని రైతులుగా గుర్తించాలని కోరారు.
నియోజకవర్గ పరిధిలో సుమారు 5 వేల ఎకరాల్లో వరి.. వందఎకరాల్లో ఉద్యాన పంటలు పూర్తిగా కుళ్లి పోయాయని చెప్పారు. ఎకరాకు 20 వేల చొప్పున పెట్టుబడి పెట్టామని అన్నారు. ఈ పరిస్థితుల్లో భూమి యజమానికి కౌలు చెల్లింపు, రెండో పంటకు పెట్టుబడుల కొరకు అప్పులు చేయవల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమికి పెట్టుబడి పెట్టి పండిస్తున్న రైతుకే ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి: