ETV Bharat / state

కరోనాతో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి మృతి - మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి కొవిడ్​తో మరణించారు. కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Former MLA  Chittabbai
మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి
author img

By

Published : Apr 29, 2021, 12:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి కరోనాతో మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం కొవిడ్‌ బారిన పడిన ఆయన.. కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడైన చిట్టబ్బాయి 2004లో అమలాపురం అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. వైకాపా ఏర్పడిన తర్వాత ఆ పార్టీ తరఫున రాష్ట్ర నాయకుడిగా కొనసాగారు. ఆయన మృతిపై సీఎం సంతాపం తెలిపారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇదీ చదవండీ.. ధూళిపాళ్ల నరేంద్ర పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.