తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరికి వరద నీరు ఉప్పొంగుతోంది. లంక ప్రాంతాల్లోని పొలాలన్నీ వరద నీటితో నిండాయి. కొత్తపేట నియోజక వర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలంలోని అరటి, కంద, పచ్చిమిర్చి, కూరగాయలు తోటలు, తమలపాకు తోటలు పూర్తిగా మునిగిపోయాయి. మెరక ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది. గత పది రోజులుగా వరద నీరు పంటపొలాల్లో నిల్వ ఉన్నందున పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమలో తీవ్ర పంట నష్టం - east godavari
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో భారీ వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లింది. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మెరక ప్రాంతాల్లోనూ వరద నీరు చేరి తోటలు పూర్తిగా మునిగాయి.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరికి వరద నీరు ఉప్పొంగుతోంది. లంక ప్రాంతాల్లోని పొలాలన్నీ వరద నీటితో నిండాయి. కొత్తపేట నియోజక వర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలంలోని అరటి, కంద, పచ్చిమిర్చి, కూరగాయలు తోటలు, తమలపాకు తోటలు పూర్తిగా మునిగిపోయాయి. మెరక ప్రాంతాల్లో కూడా వరద నీరు చేరింది. గత పది రోజులుగా వరద నీరు పంటపొలాల్లో నిల్వ ఉన్నందున పంటలు పూర్తిగా పాడైపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Body:పోలవరం ప్రసాద్
Conclusion:పోలవరం ప్రసాద్