కేంద్రపాలిత యానాంలో 5 రూపాయలకే పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం అమ్మ క్యాంటీన్, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అమృత హస్తం ద్వారా 5 రూపాయలకు ఒకపూట భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. యానాంలో మాత్రం అందుకు భిన్నంగా.. రాజకీయ పార్టీలకు అతీతంగా దిల్లీకి చెందిన ఐఎఫ్సీఐ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో... యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంలో ఈ కార్యక్రమం నిర్వహించటం విశేషం. పేదలకు తక్కువ ఖర్చుతో కడుపునింపే కార్యక్రమాన్ని సీఎఫ్ఐ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు.
ప్రతి రోజు వెయ్యి మందికి...
ప్రతి రోజు పది ప్రాంతాల్లో వెయ్యి మందికి భోజనం అందించనున్నారు. వివిధ రకాల పనులపై ఇతర ప్రాంతాల నుంచి యానాం వచ్చిన వారికి, ఒంటరిగా జీవించే వారికి ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి-అన్నదాత-సుఖీభవ పథకం రద్దు