ETV Bharat / state

లారీ డ్రైవర్​ను కొట్టి దారి దోపిడీ.. ఐదుగురు అరెస్ట్ - తూర్పు గోదావరి నేర వార్తలు

దారి దోపిడీకి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను మారేడుమిల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీన ఘాట్ రోడ్డులో విశ్రాంతి తీసుకుంటున్న డ్రైవర్​ను.. కొట్టినవారు అతని వద్ద నుంచి రూ. 7 వేలు ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన రోజే డ్రైవర్ ఫిర్యాదు చేయగా.. ఇవాళ ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

theft case
theft case
author img

By

Published : May 25, 2021, 9:35 PM IST

తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్​లో దారి దోపిడీకి పాల్పడిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రంపచోడవరంలోని ఏఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు.

ఈ నెల 23న చత్తీస్​గఢ్​కు వెళుతూ.. పాలమూరు ఘాట్ రోడ్డు వద్ద లారీని నిలిపి విశ్రాంతి తీసుకుంటున్న డ్రైవర్​ను ఐదుగురు వ్యక్తులు కొట్టడంతో పాటు రూ. 7వేలు ఎత్తుకెళ్లారని ఏఎస్పీ బిందుమాదవ్ చెప్పారు. లారీ డ్రైవర్ అదే రోజు రాత్రి మారేడుమిల్లి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారని తెలిపారు. జిఎం వలస వద్ద నిందితులు పట్టుబడ్డారని.. వారంతా రాజమహేంద్రవరం సుబ్బారావు నగర్ కు చెందినవారని పేర్కొన్నారు . వారి నుంచి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఇదీ చదవండి: పోలీసులా వేషం.. 70కి పైగా కేసుల్లో నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.