తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తేటగుంట జాతీయ రహదారిపై జరిగిన రహదారి ప్రమాదంలో.. ఐదుగురు భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. భవన స్లాబ్ నిర్మాణ పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కార్మికులు ఆటోలో వెళ్తుండగా వ్యాన్ ఢీ కొట్టటంతో ఆటో బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఐదుగురిని తుని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పాఠశాల విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించిన అనంతపురం కలెక్టర్