గ్రామాల్లో కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రజలు అధికార యంత్రాంగానికి సహకరించాలని తూర్పు గోదావరి జిల్లా సబ్ కలెక్టర్ అనుపమ అంజలి కోరారు. ఆలమూరు మండలంలోని ఐదు కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. చెముడులంక, జొన్నాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని కోవిడ్ సెంటర్లను పరిశీలించారు. కొవిడ్ రోగులకు ధైర్యం చెప్పారు. వసతుల, చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనల మేరకు రోగులు మందులు వాడాలని అన్నారు.
సబ్ కలెక్టర్ వెంట ఆలమూరు తహసీల్దార్ లక్ష్మీపతి, మండల ప్రజాపరిషత్ ఏవో టీవీ సురేందర్రెడ్డి, ఈవోపీఆర్డీ రాజ్‌కుమార్, ఆర్ఐ జానకి రాఘవ, రెవెన్యూ అధికారి ఆర్. రామచంద్ర మూర్తి, ఆయా గ్రామాల వీఆర్వోలు, నాయకులు పాల్గొన్నారు.