తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాపతిప్ప గ్రామంలో ఓఎన్జీసీ చమురు బావి నుంచి ముడి చమురు చోరీకి యత్నించిన ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను అమలాపురంలో డీఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. మెుత్తం ఏడుగురు చోరీకి యత్నించారని.. ఐదుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా వాకలగరువు, కొంకాపల్లి, ఓడలరేవు, పాసర్లపూడి లంక, పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్ల గ్రామాలకు చెందినవారని వెల్లడించారు.
ఇదీ చదవండి: