చేపల వేట, విక్రయాలతో కోలాహలంగా ఉండే తీర ప్రాంతాల్లో సందడి కరవైంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఉన్న చేపల వేట నిషేధ సమయం పూర్తైనా.. పడవలు గట్టు దాడడంలేదు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో మత్స్యకార కుటుంబాలు.. వందల సంఖ్యలో వైరస్ బారిన పడ్డాయి. చాలామంది జాలర్లు మృతిచెందారు. ఈ బాధ.. దిగమింగుకుని జీవనోపాధి కోసం ఈ నెల 22నుంచి తిరిగి చేపల వేట ప్రారంభించాలని కాకినాడ మత్స్యకారులు నిర్ణయించుకున్నారు. ఐతే.. భారీగా పెరిగిన డీజిల్ ధరలతో బోట్ల నిర్వహణ మరింత భారంగా మారిందనే ఆవేదన వ్యక్తమవుతోంది.
తూర్పు గోదావరి జిల్లాలో సుమారు.. 60 వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. సుమారు 35 వేల కుటుంబాలు సముద్రంపై ఆధారపడి జీవనం.. సాగిస్తాయి. చేపల విక్రయం, ఎగుమతులపై ఇంకొందరు ఆధారపడ్డారు. చేపల వేట విరామంతో 2నెలలుగా ఉపాధి కోల్పోయిన తమను కొవిడ్ మరిన్ని కష్టాల్లోకి నెట్టిందంటున్నారు గంగపుత్రులు. ప్రభుత్వం ఇచ్చినమత్స్యకార భరోసా అందరికీ అందలేదని చెబుతున్నారు. డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు పెరిగినందున ప్రభుత్వం రాయితీ పెంచాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!