ETV Bharat / state

మన్యంలో 5 నెలల బాలుడికి కరోనా! - మన్యంలో బాలుడికి తొలి కరోనా పాజిటివ్

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో తొలి కరోనా కేసు నమోదైంది. ఐదు నెలల బాలుడికి కరోనా సోకినట్టు నిర్థరణ అయ్యింది. ఇందుకు దారి తీసిన పరిస్థితి తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

First corona case registered for five month old boy in agency at east godavari district
మన్యంలో 5 నెలల బాలుడికి తొలి కరోనా కేసు నమోదు
author img

By

Published : May 25, 2020, 1:04 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం బొలగొండ పంచాయతీ చెరుకూరు గ్రామంలో 5 నెలల బాలుడికి కరోనా సోకింది. మన్యంలో ఈ బాలుడితోనే తొలిగా కేసుగా నమోదయింది. ఈ నెల 20న బాలుడికి జ్వరము, దగ్గు, రొంప ఉండడంతో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానిత కేసుగా శనివారం కాకినాడ జీజీహెచ్​కు ఆ చిన్నారిని తరలించారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఏ విధంగా ఈ వ్యాధి సోకింది అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

కరోనా వైద్య పరీక్షల్లో నెంబర్​ వన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.