ETV Bharat / state

కరోనా నిబంధనలు..వెలవెలబోతున్న టపాసుల దుకాణాలు - యానంలో దుకాణాల్లో దీపావళి 2020 వేడుకలు

కరోనా మహమ్మారి పుణ్యమా అని పూజలు, పండుగలు లేకుండానే.. సాదాసీదాగా జీవనం సాగించవలసి వస్తోంది. వినాయక చవితి, దేవీ నవరాత్రి మహోత్సవాలు ఏ మాత్రం సందడి లేకుండానే జరిగిపోయాయి. మూడు రోజుల్లో రానున్న దీపావళినీ అలాగే జరుపుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ఈ ఆంక్షలతో తూర్పుగోదావరి జిల్లాలోని మందుగుండు సామాను వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పండుగకు టపాసు పేలనట్లేనా అని ఆందోళనలో ఉన్నారు.

divali firework shops empty
కొనుగోలుదార్లు లేక వెలవెలబోతున్న దుకాణం
author img

By

Published : Nov 11, 2020, 4:00 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో దీపావళి మందుగుండు సామగ్రికి కేంద్ర పాలిత యానాం కేరాఫ్ అడ్రస్. ఏటా నెల రోజుల ముందు నుంచే ఇక్కడ హోల్​సేల్ వ్యాపారులు, ఉభయ గోదావరి జిల్లాల రిటైల్ వ్యాపారులు సరకు కొనుగోలు చేస్తారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి.

కరోనా ప్రభావంతో ఈ ఏడాది పండుగకు నాలుగు రోజుల ముందు కూడా కొనుగోలుదార్లు రాకపోవడంతో.. వ్యాపారం వెలవెలబోయింది. దీపావళి మందుగుండు నుంచి వెలువడే పొగతో కరోనా ముప్పు పొంచి ఉందని ప్రభుత్వం హెచ్చరించడంతో.. స్థానికులు కొనేందుకు వెనుకాడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ కోసం.. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులంతా లబోదిబోమంటున్నారు.

ఇదీ చదవండి: విద్యుత్​ తీగలు తగిలి అగ్నిప్రమాదం...ఇల్లు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.