తూర్పుగోదావరి కాకినాడ రమణయ్యపేటలోని సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంతో విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెస్తున్నారు.
ఈ ప్రమాదం వల్ల కాకినాడ నగరం, గ్రామీణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా కాకినాడ, అమలాపురం, పెద్దాపురం ప్రాంతాలకు సరఫరాను అధికారులు నిలిపివేశారు.
ఇదీ చదవండి: