ETV Bharat / state

ఫిబ్రవరి 19 నుంచి అంతర్వేది స్వామివారి కల్యాణోత్సవాలు

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఉత్సవాలను విజయవంతం చేయాలని అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌.. అధికారులకు సూచించారు.

Festive management in coordination
సమన్వయంతో ఉత్సవాల నిర్వహణ
author img

By

Published : Jan 28, 2021, 10:27 AM IST

అధికారులు సమన్వయంతో వ్యవహరించి తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దివ్య కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని అమలాపురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌశిక్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 19 నుంచి 28 వరకు జరగనున్న కల్యాణోత్సవాలపై ఆలయ ఆవరణంలోని పర్యాటకశాఖ భవనంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫిబ్రవరి 22వ తేదీన స్వామివారి కల్యాణం వీక్షించేందుకు సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా ఉత్సవాల్లో కొవిడ్ నిబంధనలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని సైతం అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.